కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ పరిధిలోని గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సందర్శించి ఉద్యోగుల సమస్యలు గురించి అడిగి తెలుసుకుని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తమ మద్దతు తెలియజేసి అత్యధిక మెజారిటీతో హన్మంత్ రెడ్డి గారిని గెలిపిస్తామని తీర్మానం చేసారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని వివిధ కాలనీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సతీమణి కొలన్ నీరజ హన్మంత్ రెడ్డి. ఇంటింటికీ తిరుగుతూ ఆమె ఉధృతంగా ప్రచారం చేశారు.
127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోనిగిరి నగర్ లో, సయ్యద్ సల్మాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,కె.యం. ప్రతాప్.ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను, గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలన్నారు. ఈనెల 30వ తారీఖున జరగబోయే శాసనసభ ఎన్నికలలో, చేతి గుర్తుకు ఓటు వేసి, కొలను హనుమంత్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి.పాషా,గరిగే రమేష్ ముదిరాజ్, పర్వేజ్ ఖాన్, అఫ్రోజ్ ఖాన్, షహీన్ బేగం, అమీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి AMR గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న మన రాష్టానికి విచేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రోడ్ షో కార్యక్రమం ఏర్పాట్లు జయప్రదం చేయడం తదితర అంశాలపై నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి భూపతి రెడ్డి, జ్యోష్ణశివా రెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మైసి గారి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, ప్రేమ్, శ్రవణ్ కుమార్, ప్రశాంత్ గౌడ్ మరియు ఇతర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.