Tuesday, July 2, 2024
HomeతెలంగాణKolcharam: లారీలు రావాలంటే లంచం ఇవ్వాల్సిందే

Kolcharam: లారీలు రావాలంటే లంచం ఇవ్వాల్సిందే

5000-10,000 లంచం

“లారీకి 5 వేల నుంచి 10 వేల రూపాయల లంచం ఇస్తేనే లారీలు వస్తున్నాయి… ఇప్పటికీ మా ఊర్లో 10 శాతం ధాన్యం కూడా తూకం కాలేదు. అకాల వర్షాలకు ధాన్యం రాశుల కిందికి నీళ్లు పోయి మొలకలు వస్తున్నాయి. కాలమేమో నెత్తి మీదకు వచ్చింది. ఏం చేయా”లంటూ మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర రైతాంగం బావురుమంటున్నారు. మంజీరా ఒడ్డున ఉన్న పైతర గ్రామంలో ఈ యాసంగిలో సుమారుగా 80 వేల బస్తాల ధాన్యం పండుతుందన్నది అంచనా. సొసైటీ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రం ఆలస్యంగా ప్రారంభించారు. ఇప్పటికి పదివేల బస్తాలు కూడా అమ్ముడు పోక పోగా, రోజూ కురుస్తున్న వానలతో రైతులు నానా యాతన పడుతున్నారు.

- Advertisement -

అకాల వర్షాలతో ధాన్యం రాశులు ఎక్కడికక్కడ తడిసి కింది భాగంలో మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు లారీలు పంపించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కోనాపూర్ లో సైతం ధాన్యం తడిసి మొలకలు వచ్చి పీచు కట్టాయి. ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News