ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను సైతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో పార్ట్ బీలో పెట్టిన రెవెన్యూ అధికారులు… గుంట భూమి లేకున్నా పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసిన సంఘటనలు కొల్చారం మండలంలో సర్వసాధారణంగా మారాయి… తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టా పాస్బుక్కులు ఇవ్వని రెవెన్యూ అధికారులు భూమి లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్న రెవెన్యూ అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం… కొల్చారం మండలం రంగంపేటలో సర్వే నంబర్ 231 లో సుమారు 200 కు పైగా ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి లో గుంట భూమి లేని రైతులకు సైతం కొందరికి రెవెన్యూ అధికారులు బై నెంబర్తో పట్టా పాస్ బుక్కులు జారీ చేశారు. సర్వే నంబర్ 231/321లో గుంట భూమి లేని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి 20 గుంటలు సాగులో ఉన్నట్లు పట్టా పాస్ పుస్తకం జారీ చేశారు. ఆ రైతుకు 10 విడతలుగా సుమారు రూ.50 వేల రూపాయలు రైతుబంధు కింద డబ్బులు వచ్చాయి. రైతుబంధు డబ్బులు రావడంతో పాటు రైతు బీమా కూడా వర్తిస్తుంది గుంత భూమి లేని వ్యక్తికి పట్టాపసుపుస్తకం జారీ చేయడం ఏమిటి రైతుబంధు రైతు బీమా వర్తింపజేయడం ఏమిటంటే గ్రామంలోని రైతులు బాటంగా ప్రశ్నిస్తున్న రెవెన్యూ అధికారులు తమ సప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తమ తప్పును సరిదిద్దుకొనడంతో పాటు గుంట భూమి లేకుండా రైతుబంధు పట్టాదారు పాసుపుస్తకం పొందిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదుచేసి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం డబ్బులు రికవరీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
*సర్వే చేసి చర్యలు తీసుకుంటా:
ఈ విషయమై కొల్చారం తహసిల్దార్ చంద్రశేఖర రావును వివరణ కోరగా సర్వే చేసి నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.