కొల్చారం మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆమె నివాసంలో కలిశారు. రేషన్ డీలర్ సంఘం ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించి, వారికి కమీషన్ పెంచడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ గుప్తా ఉపాధ్యక్షులు సాయిని సిద్ధిరాములు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే ధనరాజ్ ఏగొండ బాల్రాజ్ స్వామి దుర్గయ్య శ్రీనివాస్ వెంకన్న లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.