Sunday, July 7, 2024
HomeతెలంగాణKolparam: గ్రామపంచాయతీ భవనాల భూమి పూజలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి

Kolparam: గ్రామపంచాయతీ భవనాల భూమి పూజలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి

మండలంలో కొత్తగా ఏర్పాటు అయిన ఐదు గ్రామపంచాయతీలు

పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలో కొత్తగా ఏర్పాటు అయిన ఐదు గ్రామపంచాయతీలు నాయిని జలాల్పూర్, వసురం తండా, వెంకటాపూర్, సీతారాం తండా, తుక్కాపూర్ తోపాటు మూడు శిథిలావస్థకు చేరిన కిష్టాపూర్, రంగంపేట, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామపంచాయతీలకు ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు కాగా, నూతన భవనాల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అలాగే పోతంశేట్ పల్లి, కిష్టాపూర్,రాంపూర్ గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లు, వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్, జెడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, మండల సర్పంచుల పూర్వ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు కర్రే లచ్చయ్య, నెల్లికిష్టయ్య, మూతి పాండు నాయక్, మాధవి శ్రీశైలం, బండి సుజాత రమేష్, గోదావరి వెంకట్ రాములు, నాగరాణి నరసింహులు, ఎంపీటీసీలు సాయిని భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఎల్లయ్య, ఉదయ వేమారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్య, డీఈ లు కిషన్, అమరేశ్వర్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, ఏపీవో మహిపాల్ రెడ్డి, ఏఈలు ఇర్ఫాన్ హుస్సేన్, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, మమత, స్వాతి ప్రియ, నగేష్, శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్ల ఆంజనేయులు, సోమ నర్సింలు, ఆరే రవీందర్, దుర్గేష్, రాజా గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News