Friday, November 22, 2024
HomeతెలంగాణKomati Reddy: సీఎం అయ్యే ప్లాన్లో హరీష్ రావ్.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Komati Reddy: సీఎం అయ్యే ప్లాన్లో హరీష్ రావ్.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

కవిత, హరీష్, కేటీఆర్ ల పేరుతో బీఆర్ఎస్ విడిపోతుంది

హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయని, సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్టున్నాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని, ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ ల పేర్ల మీద విడిపోతుందని, టీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని, హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

- Advertisement -

ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని, కేసీఆర్ కట్టె పట్టుకొని తిరుగుతున్నాడు… ఆయన పులి ఎట్లా అవుతాడని మంత్రి అన్నారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే… 86 కిలోలు ఉన్న నేనేం కావాలని, ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని అసెంబ్లీ లాబీ చిట్ చాట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మనసులో మాట మీడియా మిత్రులతో పంచుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News