Saturday, November 15, 2025
HomeతెలంగాణRajagopal reddy: సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు

Rajagopal reddy: సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల వేడి మరోసారి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన, పాలనలో ప్రభుత్వ పరమైన స్పష్టత లేదని, తప్పుడు దిశలో నడుస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మానేసి, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. “సీఎం తన ధోరణిని మార్చుకోవాలి. విమర్శలు కాదు, వాస్తవాలు చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

తెలంగాణలోని ప్రాజెక్టులు, పనులపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు కాంట్రాక్టర్లు ఆధిపత్యం చూపుతున్నారని ఆరోపించారు. “ఇప్పటికే 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన మరో ఆసక్తికర అంశం.. తనకు కాంగ్రెస్ హైకమాండ్ మంత్రిపదవి హామీ ఇచ్చిందట. “నాకు మంత్రి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవాడు. కానీ నేను కాంగ్రెస్ కోసం పనిచేశాను. ఇప్పుడు హైకమాండ్ నాకు హామీ ఇచ్చింది” అని స్పష్టం చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తన మంత్రిపదవి అంశం తెలియదని కూడా చెప్పారు.

“రెవంత్ రెడ్డి మరో మూడున్నరేళ్లు సీఎం”

ఇంకా మూడున్నరేళ్లపాటు రేవంత్ రెడ్డి సీఎం పదవిలో కొనసాగుతారని అభిప్రాయపడిన రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఎవరు సీఎంగా వస్తారో అప్పుడే తెలుస్తుందన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి రావడం అందరి సహకారంతోనే సాధ్యమైంది” అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయిన నిరాశతో తలెత్తిన అశాంతిలో ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ ముందుగా తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కమీషన్ల పేరుతో కాలయాపన జరుగుతోందని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి, ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. “బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?” అని నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad