Wednesday, October 30, 2024
Homeతెలంగాణటీయూడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి

టీయూడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి

సీనియర్ జర్నలిస్టు..

టీయూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డికి రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవీ లభించింది. 22 ఏళ్లుగా జర్నలిస్ట్ గా రంగారెడ్డి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన శ్రీకాంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండే శ్రీకాంత్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి,ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా అందరి మన్ననలు పొందారు. జిల్లాలోని జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చిన ముందుంటారని,ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని జిల్లా పేరును అగ్రస్థానంలో నిలపాలని జిల్లా జర్నలిస్టులు ఆకాంక్షిస్తున్నారు.రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి ఎన్నికవ్వటం పట్ల జిల్లాలోని ఆయా నియోజలవర్గాల,మండలాల యూనియన్ నేతలు,జర్నలిస్టులు,ప్రెస్ క్లబ్ ల నేతలు హర్షం ప్రకటించారు.

- Advertisement -

జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తా :శ్రీకాంత్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ద్వేయంగా పనిచేస్తూ వారి గొంతుకగా ఉంటానని నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవ్వటానికి సహకరించిన యూనియన్ సీనియర్ నేతలకు,33 జిల్లాల అధ్యక్ష,కార్యదర్శులకు,నేషనల్, రాష్ట్ర కౌన్సిల్ సబ్యులకు, జర్నలిస్ట్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామన్నారు. రైల్వే రాయితీని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము అన్నారు.మహాసభల్లో పాల్గోన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి లు ఇళ్ల స్థలాల పట్టాలపై ఒక స్పష్టమైన హామీ ఇచ్చారని ఇది ఎంతో గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. మహాసభల్లో చేసిన తీర్మానాలను ముందుకు తీసుకెళ్లి అందరికీ అండగా ఉంటామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News