Monday, April 7, 2025
HomeతెలంగాణKomurelli: ఉగాది సందర్భంగా మల్లన్నను దర్శించుకున్న అడిషనల్ డీసీపీ

Komurelli: ఉగాది సందర్భంగా మల్లన్నను దర్శించుకున్న అడిషనల్ డీసీపీ

నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పంచాంగ శ్రవణానికి అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ముఖ్య అతిథిగా హాజరై, పంచాంగ శ్రవణం పూర్తయిన తర్వాత మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని, వేద పండితుల ఆశీర్వాదం పొంది, టెంపుల్ ఆవరణలో ఉన్న  దేవాలయాలను సందర్శించారు. ఆ భగవంతుని దయవల్ల ఈ సంవత్సరం ప్రజలందరూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి, కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, కొమరవెల్లి ఆలయం కమిటీ చైర్మన్ గీస బిక్షపతి, ఏఈఓ అంజయ్య, దేవాలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, మహాదేవుని సాంబయ్య, దేవాలయం అర్చకులు  ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News