Friday, November 22, 2024
HomeతెలంగాణKonaraopeta: రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం

Konaraopeta: రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతుల కళ్లలో ఆనందం చూడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

- Advertisement -

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలోని 23వేలపై చిలుకు రైతులకు దాదాపు రూ. 137 కోట్లు మాఫీ కానున్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ భూమి ఉండి, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు బ్యాంక్ లో రుణం తీసుకుంటే కచ్చితంగా రుణ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అయన తెలిపారు.

రైతులకు సాగులో నూతన పద్ధతులు, యంత్ర పరికరాలు వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికల్లో రైతు నేస్తం పేరిట కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, డీఏఓ భాస్కర్, మండల వ్యవసాయ అధికారులు, వెంకట్రావమ్మ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా,కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి డీసీసీ కార్యదర్శులు చేపూరి గంగాధర్, కచ్చకాయల ఎల్లయ్య, తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News