తెలంగాణ ప్రభుత్వంలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతోందని కోనరావుపేట జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. మండలంలోని మర్తనపెట్ గ్రామంలో వినాయక ఇండస్ట్రీస్ (రైస్ మిల్) ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్టం సాధించుకున్న తర్వాత సాగు, త్రాగు నీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అందువల్ల వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందాన్నరు. అందులోనే భాగంగానే ఒకప్పుడు పట్టణలకే పరిమితమైన రైస్ మిల్, భారీ పరిశ్రమలు ఇప్పుడు పల్లెల్లో నెలకొల్పడం ప్రభుత్వయొక్క అభివృద్ధికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మర్తనపెట్ సర్పంచ్ వంశీకృష్ణరావు, పాక్స్ చైర్మన్ బండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.