Saturday, November 23, 2024
HomeతెలంగాణKonaraopeta: చి(చె )త్త శుద్ధి లేని చెత్త సేకరణ

Konaraopeta: చి(చె )త్త శుద్ధి లేని చెత్త సేకరణ

సేకరించి కాలుస్తున్నారు!

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గత ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా మారాయి. ఇళ్లలోని చెత్తను తరలించేందుకు పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చింది. గ్రామాల్లో ఉన్న తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త సేకరణ చేయాలని గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు బాధ్యతలను పెంచింది. పొడి చెత్త వ్యర్తాలను వేరు చేసి కంపోస్ట్ షెడ్ లో సేంద్రీయ ఎరువులను తయారు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ చాలా గ్రామాల్లో వీధుల్లో ట్రాక్టర్తో ఇళ్లలోని చెత్తను మురుగు కాలువల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను కూడా సేకరిస్తు షెడ్ల వద్దనే గ్రామ పంచాయతీ సిబ్బంది కాలుస్తున్నారు. జల్లో తడి, పొడి రెండు డబ్బాలు అందించినా ప్రజలకు పూర్తిస్థాయిలో ఆవగాహన లేక తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి ఇస్తున్నారు.

- Advertisement -

అవగాహనా లోపం.. .

మండల పరిధిలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు 40 వేలకు పైగా జనాభా ఉంది. జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పారిశుధ్యనిధులు అందజేస్తోంది. అందులో బాగంగానే గ్రామాల్లో కంపోస్ట్ షెడ్లు, డంపింగ్ యార్డులు నిర్మిచింది.సేంద్రియ ఎరువులు తయారు చేయాలని ఆదేశించింది. కానీ మండలంలోని ఒకటి, రెండు గ్రామ పంచాయతీల్లో మినహాయిస్తే, ఏ గ్రామపంచాయతీ పరిధిలో ఆశించిన మేరకు సేంద్రీయ ఎరువులను తయారీ చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో షెడ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేందుకు దారి కూడా సక్రమంగా లేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లో సేకరించిన చెత్తను ఎక్కడో ఓ చోట పారబోస్తున్నారు. కొందరు సమీపంలో ఉన్న ఒర్రెల్లో, మరికొందరు రోడ్ల వెంట పోసి నిప్పు పెడుతున్నారు. దీంతో పర్యావరణం కూడాదెబ్బ తింటుంది. రోడ్లవెంట ప్రయాణికులు సైతంపొగతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అమలుకు సహకరించక పోవడంతో షెడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి.

ఏటా సుమారుగా రూ.40.3 లక్షలు

గ్రామాల్లో చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు ఏటా దాదాపు రూ.40.3 లక్షల డీజిల్ ఖర్చులు అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కంపోస్ట్ షెడ్ల వినియోగంతో ఆశించిన మేర సేంద్రీయ ఎరువును తయారు చేస్తే గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని భావించినా
ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో సేకరించినవ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ ఎరువును ఏడాదిలో కనీసం రెండు సార్లు అయినా తీసిన గ్రామ పంచాయతీలు లేవు. కానీ మండలస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు మాత్రం కంపోస్ట్ షెడ్లలో తయారు చేసిన సేంద్రీయ ఎరువును హరితహారంలో నియోగిస్తున్నామంటూచెబుతున్నారు. లక్షల్లో ఖర్చు పెట్టి చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇళ్ల సమీపంలోనే చికెన్ వ్యర్థాలు. ..

గ్రామంలోని చెత్తా చెదారం, చికెన్ వ్యర్థలను ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను రోడ్ల పక్కన ఇండ్ల మధ్యలో పడవేయడంతో దుర్గంధం వస్తుందని ప్రజలు అంటున్నారు.

తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి

గ్రామాల్లో చెత్త సేకరణ సజావుగానే సాగుతోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబనికి తడి, పొడి చెత్త కు డబ్బాలు ఇవ్వడం జరిగింది. తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలి. గ్రామ స్థాయిలో తడి, పొడి చెత్త పైన మరోసారి అవగాహన కల్పిస్తాం, చెత్త సేకరణలో లభ్యమైన తునికాకు వ్యర్థాలతో సేంద్రీయ ఎరువు తయారు చేస్తున్నాం. ఎవరైనా రోడ్లపైన చెత్త పారబోస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తాం, అలాగే మల్టిపర్పస్ ఉద్యోగులు ఎవరైనా డంపింగ్ యార్డ్ లో చెత్తను కాల్చితే 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని కోనరావుపేట మిర్జా ఎంపీవో హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News