Thursday, September 19, 2024
HomeతెలంగాణKonaraopeta: మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

Konaraopeta: మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9 లో 504 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌కు ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.
మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను ప్రారంభించారు. ట్రయల్ రన్ చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించి విజయవంతం చేశారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, MRKR,WPL ఏజెన్సీ ల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు.
ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టు కు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కొన్ని సంవత్సరాలనుండి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం కానున్నాయి. మల్కపేట రిజర్వాయర్‌ ను త్వరలోనే సీఎం కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News