Konda Murali speek on Surekha issue: అర్ధరాత్రి నుంచి మంత్రి కొండా సురేఖ ఇంటివద్ద నడుస్తున్న హైడ్రామాపై కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి వైరుధ్యాలు లేవని అన్నారు. రాజశేఖర్ రెడ్డి తరవాత తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనుకున్నామని తెలిపారు. ఆయన సీఎం కావాలని మొదటినుంచి కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని అని కొండా మురళి వ్యాఖ్యానించారు. మా మధ్య విభేదాలను ఎవరైనా సృష్టిస్తే దానికి తాను బాధ్యుడిని కాదని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
అసలేం జరిగిందో నాకు తెలియదు: ఈ రోజు వరంగల్‌లో పార్టీ మీటింగ్ ఉందని కొండా మురళి అన్నారు. దాని కోసమే తాను వరంగల్ వచ్చానని చెప్పారు. ఇంటివద్ద ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మీటింగ్‌కు కొండా సురేఖ సైతం వస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తను ఇప్పటివరకు ఒకసారి కూడా సెక్రటరేట్‌కు వెళ్లలేదని కొండా మురళి అన్నారు. ఇకపై కూడా వెళ్లనని చెప్పారు. కొండా సురేఖ చాంబర్ వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని తెలిపారు. తనకు ఏమైనా అవసరం ఉంటే ఉత్తమ్, రేవంత్ రెడ్డి ఇళ్లకు వెళ్తాను తప్పా.. వేరే వద్దకు పోనని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఆయన వెంట వెళ్లేవాడినని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/konda-sushmita-patel-hot-comments-on-cm-revanth-reddy/
నా బిడ్డకు స్వేచ్ఛ ఉంది: నా బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. సుస్మిత పటేల్‌కు పార్టీలో ఎలాంటి పదవులు లేవని తెలిపారు. నా మనవరాలు లండన్‌లో చదువుతుందని అన్నారు. నా అల్లుడి వ్యాపారాలు కూడా అక్కడే ఉన్నాయని తెలిపారు. నిన్న రాత్రి సుమంత్ ఎపిసోడ్ కోసం నాకు తెలియదని అన్నారు. నా బిడ్డ ఏం మాట్లాడిందో కూడా నాకు తెలియదని కొండా మురళి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని..అనుచరులు అంటే విన్నానని కొండా మురళి అన్నారు. నాకు ఫోన్ కూడా చూడరాదని మురళి చెప్పారు.


