Thursday, December 5, 2024
HomeతెలంగాణKonda Surekha | వార్షిక ప్రగతి నివేదిక ఆవిష్కరించిన మంత్రి

Konda Surekha | వార్షిక ప్రగతి నివేదిక ఆవిష్కరించిన మంత్రి

Konda Surekha | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను వైభవోపేతంగా తీర్చిదిద్దుతూనే, సామాన్య భక్తులకు దేవాలయాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ సాధించిన వార్షిక ప్రగతి నివేదికను మంత్రి సురేఖ నేడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవిష్కరించారు.

- Advertisement -

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన సుదర్శన, గణపతి, నవగ్రహ చండీ హోమాల అనంతరం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి చేరుకున్న మంత్రి సురేఖకి వేదపండితులు ఆలయలాంఛనాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక పనులను పూర్తి చేసేందుకుగాను కట్టుదిట్టంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తోందన్నారు. దేవాలయాలను భక్తులకు సాంత్వననిచ్చే ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. సంవత్సర కాలంలో దేవాలయాల్లో పేరుకుపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తూ, దేవాలయాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన ఇందిరా మహిళా శక్తి గ్రూపులతో అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకోవడం జరిగిందని తెలిపారు. పర్యాటక శాఖతో అనుసంధానమై 3 టెంపుల్ టూరిజం సర్క్యూట్‌లను తీర్చిదిద్దడం జరుగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. సిజిఎఫ్ నిధులతో రూ. 10.37 కోట్ల అంచనాలతో 25 పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యాల నిమిత్తం ఐటి శాఖ ఆధ్వర్యంలో మీ సేవ, టి యాప్ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి సురేఖ అన్నారు. దాదాపు రూ. 400 కోట్లతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News