Sunday, September 8, 2024
HomeతెలంగాణKondapaka: రైతులు నష్టపోకుండా చూడాలి

Kondapaka: రైతులు నష్టపోకుండా చూడాలి

జిల్లా వ్యాప్తంగా వరసగా కురుస్తున్న వడ గండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సంబoదిత వ్యవసాయ శాఖ అధికారుల దెబ్బతిన్న పంటలను అంచనా వేయడంలో పూర్తిగా నష్టపోయిన పంటలను పూర్తిగా అంచనా వేసి వంద శాతం నమోదు చేయాలని రాలకుండా మిగిలిన వడ్లను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు నిర్వహించాలని కోరారు. అంకిరెడ్డిపల్లి, వెలికట్ట, దర్గా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద మొలకెత్తిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు జేశ్వంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ ప్రముఖ్ మహెందర్ రెడ్డి, న్యాయ ప్రముఖ్ శ్రీనివాస్ రావు , మహిళ ప్రముఖ్ నిర్మల సిద్దిపేట మండల అర్బన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి నాయకులు కమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హరీశ్, శ్రీనివాస్ రెడ్డి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News