సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమ ఉద్యోగాలు శాశ్వతం చేయాలని వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని 10 లక్షల వరకు బీమా కల్పించాలని ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విద్యాశాఖ నియమకాలలో వెయిటింగ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యాశాఖకు పాఠశాల విద్యకు అనుబంధంగా పనిచేస్తున్న తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ సమ్మెను చేపట్టామని సిద్దిపేట జిల్లా సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయబాలకిషన్ వివరించారు.
అధిక సంఖ్యలో పాల్గొన్న సమగ్ర శిక్షణ ఉద్యోగులకు మద్దతుగా బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మెను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వం సిఆర్పిల చేత విద్యా శాఖకు సేవ చేస్తున్న ఈ తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారి శ్రమ దోపిడిని నివారించాలని పూర్తిస్థాయి స్కేలు ప్రకటించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీరి సమస్యల పైన ఏ మాత్రం స్పందించకపోవడం విద్యా శాఖ మంత్రి పట్టించుకోకపోవడం చాలా విచారకరమని ఆయన అన్నారు. వీరి న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమని ఆయన ప్రశ్నించారు. మీ కోరికలు నెరవేరేంతవరకు మేము మీ వెంటే ఉంటామని ఆయన ఉద్యోగులకు మద్దతు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరి డిమాండ్లను ఆమోదించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.