ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప. ఇప్పటికే పలువురు గులాబీ సిట్టింగులు, మాజీలు రేవంత్ ను వరుసపెట్టి కలుస్తున్నారు. కొందరు వెంటనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరగా, మరికొందరు మర్యాదపూర్వక భేటీ అంటూ సీఎంను కలిసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయే ప్రయత్నంలో ఉండటం విశేషం.