Thursday, September 19, 2024
HomeతెలంగాణKorukanti Chander: 'హరిత తెలంగాణ' సాధనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

Korukanti Chander: ‘హరిత తెలంగాణ’ సాధనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

చరిత్రలో మొక్కలు నాటిన పేరు అశోకుడికి ఉండేది, భవిష్యత్ లో కేసీఆర్ పేరు

హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితోత్సవం పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్ ఆవరణ లో మొక్కలు నాటి 9 వ విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో మొక్కలు నాటిన పేరు అశోకుడికి ఉండేదని వర్తమానంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె సి ఆర్ శ్రీ కారం చుట్టి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మునిసిపాలిటీలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి మొక్కల పెంపకం కోసమే ఉపయోగించేలా చట్టం చేశారని అన్నారు. అలాగే నాటిన మొక్కలలో కనీసం 85 శాతం జీవించి ఉండేలా చూడాల్సిన భాద్యతను కూడా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అప్పగించారని అన్నారు.

- Advertisement -

ఎం పి జోగినపల్లి సంతోష్ రావు ఆరంబించిన గ్రీన్ ఛాలెంజ్ కు దేశ వ్యాప్తంగా ప్రముఖులు స్పందించి మొక్కలు నాటుతున్నారని అన్నారు. పచ్చదనం పెంపొందించి వాతావరణ సమతుల్యత పరిరక్షించాలనే లక్ష్యంతో గత ఎనిమిది విడతలు గా నిర్వహించిన హరిత హారం కారణంగా స్థానికంగా కాలుష్యం తగ్గిపోయిందని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణా భాద్యతలు స్వీకరించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా లక్ష్యానికి మించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని అన్నారు. స్థానిక ప్రభుత్వ రంగ సంస్థలను కలుపుకొని తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో 16 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా ఆర్ ఎఫ్ సి ఎల్ ఆవరణలో మున్సిపల్ సిబ్బంది , మెప్మా సిబ్బంది , ఆర్ పిలు , స్వశక్తి మహిళల సహకారంతో వెయ్యి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీల పద్మ గణేష్ , కుమ్మరి శ్రీనివాస్ , పాముకుంట్ల భాస్కర్ , బాలరాజ్ కుమార్ , ఎస్ ఇ చిన్నా రావు , ఇ ఇ సుచరణ్ , డి ఇ రవి కుమార్ , ఎ ఇ లు జమీల్ , తేజస్విని , షాబాజ్ , మున్సిపల్ సూపరింటెండెంట్ మనోహర్ , హరిత హారం సూపర్వైజయింగ్ అధికారి అర్జున్ , జూనియర్ అసిస్టెంట్ శంకర్ రావు మెప్మా డి ఎం సి రజనీ , టి ఎం సి శ్వేత , సి ఓ లు , ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు జి ఓ డాబీ , సత్యనారాయణ , శ్యామ్ కుమార్ , వి. శుక్లా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News