Friday, April 4, 2025
HomeతెలంగాణKorukanti Chander: పేదోళ్ల దైవం కేటీఆర్

Korukanti Chander: పేదోళ్ల దైవం కేటీఆర్

40 మంది క్యాన్సర్ పేషెంట్లకు విజయమ్మ భరోసా

తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ల దైవం కేటీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్బంగా విజయమ్మ పౌండేషన్ ద్వారా 40 మంది క్యాన్సర్ పేషెంట్లకు 521 రూపాయలు చొప్పున ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సహాయం చెయ్యాలి పేదల కళ్లలో ఆనందం నింపాలన్న గొప్ప లక్ష్యం కలిగిన మనసున్న మారాజు కేటిఆర్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుపేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత మన కె.టి. రామన్న అన్నారు. కె టి ఆర్ నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అత్యున్నత స్థానంలోకి వెళ్లాలని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ కార్పోరేటర్లు బాల రాజ్ కుమార్ జనగామ కవిత సరోజిని నాయకులు కలువల సంజీవ్ మండ రమేష్ పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News