Saturday, November 23, 2024
HomeతెలంగాణKorukanti Chander: సమాజ హితం కోసం పాటుపడేవారు విశ్వబ్రాహ్మణులు

Korukanti Chander: సమాజ హితం కోసం పాటుపడేవారు విశ్వబ్రాహ్మణులు

సమాజ బాగు కోసం పరితపిస్తున్న విశ్వబ్రాహ్మణులు

సమాజహితం కోసం యజ్ఞయాగాలను చేస్తూ ప్రజల బాగు కోసం విశ్వబ్రాహ్మణులు ఎంతగానో కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఎమ్మెల్యే చందర్ విశ్వ బ్రహ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు సమాజంలో ఎనలేని గౌరవం పొందుతున్నారని అన్నారు. భగవద్గీత, రామాయణం లాంటి పురాణాలను పారాయణం చేస్తూ సమాజ బాగు కోసం పరితపిస్తున్నారని అన్నారు. భక్తి భావంతో జీవించడం గొప్ప అదృష్టమన్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించినప్పుడే ఉన్నతమైన సమాజం ఆవిర్భవిస్తుందన్నారు. గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను నిర్లక్ష్యంగా చూసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ తరుణంలోనే ధూప దీప నైవేద్యాలకు రూ.10 వేలను కేటాయించారని అన్నారు. విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం నూతన కమిటీ బాధ్యులకు నియామక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ ను నూతన కమిటీ బాధ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా నూతన కమిటీ బాధ్యులు కట్ట గోపాల చారి, మహేందర్ చారి, ముల్కల గోవర్ధన శాస్త్రి, రాజమౌలేశ్వర చారి, కట్ట సురేష్ భవాని, సదానందం, వెంకట చారిలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు మేకల సదానందం యాదవ్, కన్నూరి సతీష్ కుమార్, కుమ్మరి శ్రీనివాస్, సాగంటి శంకర్, నాయకులు గన్ముకుల తిరుపతి, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్, అడప శ్రీనివాస్, దొమ్మేటి వాసు, చిలుముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News