Wednesday, October 2, 2024
HomeతెలంగాణKothapeta: కొత్తపేటలో అంజయ్య యాదవ్ ప్రచారం

Kothapeta: కొత్తపేటలో అంజయ్య యాదవ్ ప్రచారం

అభివృద్ధి పథకాలు వివరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. 135 లక్షలతో సి.సి రోడ్లు, అంతర్గత మురుగుకాలువ నిర్మాణం పనులు, ఆసరా పింఛన్ ధ్వారా 374 మందికి ప్రతి నెలకు 4,14,500/- అందిస్తున్నామన్నారు. షాద్ నగర్ నుండి మక్తమదారం వయా కొత్తపేట బి.టి రోడ్డు 48 కోట్లు, కొత్తపేట నుండి చౌలపల్లి వయా పాటిగడ్డ బి.టి రోడ్డు 1.41 కోట్లు, కొత్తపేట నుండి కోనాయిపల్లి బి.టి రోడ్డు 43.75 లక్షలతో, కొత్తపేట నుండి అల్వాల్ బి.టి రోడ్డు 1.76 కోట్లతో నిర్మాణం, కొత్తపేట నుండి వేములనర్వ వయా బి.టి రోడ్డు 56.25 లక్షలు నిధులు, కొత్తూర్ నుండి కొత్తపేట వరకు 34.3 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణం వంటివున్నాయని ఆయన గుర్తుచేశారు.
దాదాపు 97.7 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 2 ట్యాంకుల నిర్మాణం ద్వారా 1201 ఇండ్లకు త్రాగునీటి సరఫరా., మిషన్ కాకతీయ ద్వారా 71.06 లక్షల వ్యయంతో, 3 కుంటల పూడికతీత, రూ. 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం., కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా 149 మందికి 14.91 కోట్లు పంపిణీ.,రైతు బంధు లబ్ధిదారులు 1112 మంది, 9.95 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 1385 మంది, 17.14 కోట్లు రైతు భీమా లబ్ధిదారులు 17 మంది, 85 లక్షలు.వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం రూ. 70 లక్షలు.
నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం రూ. 20 లక్షలు కేటాయిచినట్టు వివరించారు.
డంపింగ్ యార్డు, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం నిర్మాణం.ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్, కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News