Wednesday, April 2, 2025
HomeతెలంగాణKTR: ఆ నిధులతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్

KTR: ఆ నిధులతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్

ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు(Formula E-Racing Case) సంబంధించి తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వేసిన క్వాష్ పిటిషన్‌కు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు కౌంటర్‌గా కేటీఆర్ రిప్లై ఇస్తూ అఫిడవిట్ సమర్పించారు. ఫార్ములా రేస్ ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత.. మంత్రిగా తనది కాదన్నారు.

- Advertisement -

ఈ-కార్‌ రేస్‌కు ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను HMDAనే చూసుకోవాలని స్పష్టం చేశారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు. రూ.10 కోట్లకు మించి జరిగే చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న HMDA నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని విషయం అని చెప్పారు. అలాగే 10వ సీజన్‌ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ-రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News