KTR AND BANDI SANJAY: తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాల నేపథ్యంలో రాష్ట్రం దాదాపు అంధకారంలో మునిగిపోయింది. అనేక జిల్లాల్లో వరదలు తీవ్ర సమస్యగా మారగా.. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించగా, మరోవైపు కేంద్ర సహాయాన్ని తీసుకురావడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఇద్దరు నేతలు సిరిసిల్లలోని గంభీరావుపేట మండలంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ సమయంలో వరద ప్రమాదం, జరిగిన నష్టం గురించి కేటీఆర్ బండి సంజయ్ కి వివరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీఆర్–బండి సంజయ్ మధ్య పలు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రజల కోసం తీసుకోవాల్సిన చర్యల విషయానికొస్తే అభిప్రాయ బేధాలు పక్కన పెట్టి కలసి నిలవాలని ఈ సన్నివేశం ప్రతిబింబించింది.
Bandi Sanjay and KTR at Sircilla pic.twitter.com/xlpC7BoA2J
— Naveena (@TheNaveena) August 28, 2025
బండి సంజయ్ తీసుకున్న చర్యలు:
* తెలంగాణలో వరదల తీవ్రతపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపి వెంటనే నిధులు, సహాయక సామగ్రి అందేలా చర్యలు చేపట్టారు.
* ఆర్మీ, NDRF బృందాలను తెలంగాణలో అత్యంత ప్రభావిత ప్రాంతాలకు రప్పించేందుకు కేంద్ర హోం మంత్రితతో మాట్లాడి కృషి చేశారు.
* కేంద్ర జల వనరులు, రహదారుల శాఖలతో మాట్లాడి అత్యవసర పునరుద్ధరణ పనులకు సాంకేతిక సహాయం తీసుకొచ్చారు బండి సంజయ్.


