భూపాలపల్లి లో జరిగిన బహిరంగ సభ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని అభినందించారు. తన శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి అధ్వర్యంలో, డ్వాక్రా మహిళలకు భారీ ఎత్తున రుణాలు ఇస్తుండగా, భూపాలపల్లి నియోజకవర్గానికి ఈ రోజు 303 కోట్ల రూపాయల రుణాలు తన చేతుల మీదుగా అందించినందుకు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ని అభినందించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అడగగానే, తన సూచన మేరకు 25 కోట్ల రూపాయలను నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి ప్రకటించడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో భూపాల పల్లి orr కోసం రూ.135 కోట్లను ప్రకటించారు. మెడికల్ కాలేజీ వంటి పలు హామీలను నెరవేరుస్తామని చెప్పారు. మొత్తానికి భూపాలపల్లి పర్యటన విజయవంతంగా ముగియగా, వేలాది మంది సభకు తరలి రావడంతో కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లికి 25 కోట్ల పంచాయతీ రాజ్ నిధులను మంజూరు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భూపాలపల్లిలో ఈరోజు జరిగిన ఇంత పెద్ద బహిరంగ సభ ఎక్కడా జరగలేదని ..దాదాపు 50వేల మంది ఈ సభకు వచ్చారని ఎర్రబెల్లి అన్నారు.