బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
KTR: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


