ఫార్ములా-ఈ రేసు(Formula-E Race) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఆయన వెంట లాయర్ రామచంద్రరావు ఉన్నారు. అయితే విచారణ గదిలోకి మాత్రం న్యాయవాదికి అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన పక్కనే లైబ్రరీ రూంలో ఉండి విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ విచారణ సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగుతుంది. కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు(ACB Officers) విచారిస్తున్నారు.
వీరిలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఉన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు మొత్తం 40 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్‌ల ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేటీఆర్ విచారణ దృష్ట్యా పోలీసులు ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను గృహనిర్భందం చేశారు.