Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR Birth day: సత్తుపల్లిలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

KTR Birth day: సత్తుపల్లిలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

పేదలకు వితరణ చేపట్టిన ఎమ్మెల్యే

సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ పెయింటింగ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్ ఫోటోలు ఆకర్షణగా నిలిచాయి. మున్సిపాలిటీ సిబ్బందికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుల్ల క్రిష్ణయ్య, ఆత్మ చైర్మన్ వనమా వాసు, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, అమరవరపు విజయ నిర్మల, వీరపనేని రాధిక బేబీ, చాంద్ పాషా, మట్టా ప్రసాదు, నాయకులు కంటే అప్పారావు, వల్లభనేని పవన్, మాధురి మధు, వేములపల్లి మధు, మేకల నరసింహరావు, తాడికమల్ల ప్రకాష్ తదితులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad