Friday, September 20, 2024
HomeతెలంగాణKTR Birth day by Challa Sreelatha: నేరేడుచర్లలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

KTR Birth day by Challa Sreelatha: నేరేడుచర్లలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

నేరేడుచర్ల పట్టణంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో .. కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు/మున్సిపల్ వైస్ చల్లా శ్రీలత రెడ్డి, సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్, బిఆర్ఎస్ నాయకులతో కలిసి పట్టణ ప్రధాన కూడలి వద్ద కేక్ కటింగ్ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నేరేడుచర్లలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా శ్రీలత అన్నారు. కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధన దిశగా ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News