Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR Challenges: దమ్ముంటే రాజీనామా చేయించి ఎన్నికలకు రండి!.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్!

KTR Challenges: దమ్ముంటే రాజీనామా చేయించి ఎన్నికలకు రండి!.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్!

- Advertisement -

KTR Challenges: గద్వాల గర్జన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేసీఆర్‌ను పొగిడారు. కేసీఆర్ హయాంలో దాదాపు పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు.

తీవ్ర విమర్శలు, సవాళ్లు:

కేటీఆర్ గద్వాల గడ్డపై మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. గతంలో రైలు కింద తలపెడతాను కానీ పార్టీ మారనని చెప్పిన ఆయన, ఇప్పుడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది నియోజకవర్గ అభివృద్ధి కోసమా, లేక సొంత ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని, ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా సీరియస్‌గా ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. “దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై ఆరోపణలు:

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, గ్రూప్-1 ఉద్యోగాలను కూడా అమ్మేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తే, ఎవరైనా అప్పు ఇస్తారా అని ప్రశ్నించి, ఇది రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే చర్య అని విమర్శించారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేక పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ గద్వాల గర్జన సభ ద్వారా కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి దూకుడు పెంచుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad