Monday, December 9, 2024
HomeతెలంగాణKTR: అది నోరు కాదు మూసీ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR: అది నోరు కాదు మూసీ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR| సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ‘ఎక్స్’ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మాసిటీ కాదు..పారిశ్రామిక కారిడార్ వస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

- Advertisement -

‘అది నోరైతే నిజాలు వస్తాయి..అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని, పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. అలాగే మీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా చెబుతోంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేశారు. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొట్టారు. మీ అన్న తిరుపతి రెడ్డి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అణిచివేయలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాగా లగచర్లలో ఫార్మా సిటీ రానుందనే వార్తల నేపథ్యంలో సీపీఐ(CPI), సీపీఎం(CPM) నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించేది ఫార్మా సిటీ కాదని.. పారిశ్రామిక కారిడార్ అని కమ్యూనిస్టు నాయకులకు రేవంత్ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News