Thursday, January 16, 2025
HomeతెలంగాణKTR: ఈడీ కార్యాలయంలో ముగిసిన కేటీఆర్ విచారణ

KTR: ఈడీ కార్యాలయంలో ముగిసిన కేటీఆర్ విచారణ

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అధికారులు అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు.

- Advertisement -

కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఎక్కడ ఉద్రికత్త ఘటనలు జరగకుండా సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News