Wednesday, February 12, 2025
HomeతెలంగాణKTR filed nomination in Sirisilla: సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్

KTR filed nomination in Sirisilla: సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్

గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి‌ వస్తే‌ ఊరుకుందమా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆ తరువాత మీడియాతో ఇష్టాగోష్టి చేపట్టారు.

- Advertisement -

” నాకు రాజకీయ బిక్షని ఇచ్చిన నియోజకవర్గం సిరిసిల్ల.. సిరిసిల్ల ‌ప్రజల ఆశీర్వాదం తోనే గెలిచి సిరిసిల్ల అభివృద్ధి చేసాను.. సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా పనిచేసాను.. ఎట్లుంటే సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయ్యింది.. రాష్ట్రంలో ‌సిరిసిల్లా అభివృద్ధి లో‌ ముందు ఉన్నాం.. కెసిఆర్ ఆశీర్వాదం తో తొమ్మిది ఎండ్లు‌ మంత్రిగా పనిచేసాను.. గౌరవ మెజారిటితో తిరిగి ‌గెలిపిస్తారని నమ్మకం ‌ఉంది.. తానే క్యాండెట్ అనే విధంగా నాలుగుసార్లు గెలిపించారు.. ఇంటింటికి‌ ప్రగతి నివేదికలు పంపుతాను.. నేను సిరిసిల్లకి‌ ఏం చేసాను, బిజేపి కాంగ్రెస్ ఏం చేసారు.. రాజీలేని‌ పొరాటం‌ చేస్తున్న కెసిఆర్ పై కాంగ్రెస్, బిజెపి దండయాత్ర కు‌ వస్తున్నారు.. గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి‌ వస్తే‌ ఊరుకుందమా చేవలేని, సాతగాని వాళ్ళు బిజేపి కాంగ్రెస్ వాళ్ళు.. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్ళు కావాలా, నీళ్ళు కావాలా కులం,మతం పేర కుంపట్లు పెట్టలేదు కెసిఆర్.. ఎన్నికలు రాగానే కులం, మతం అంటున్నారు.. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నాయకులు మనకు‌ అవసరమా? ఢిల్లీ వాడు వచ్చి దండయాత్ర చేస్తుంటే ఊరుకుందమా, తాత్కలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతాం.. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తది” అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News