Thursday, November 14, 2024
HomeతెలంగాణKTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్

KTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్

KTR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై పోలీసులు దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. దళితులకు దళితబంధు పథకం డబ్బులు ఇవ్వాలని అడిగితే దాడి చేస్తారా..? అని మండిపడ్డారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే దాడి చేయ‌డ‌మేనా ఇందిర‌మ్మ రాజ్యం అంటే..? అని ప్ర‌శ్నించారు.

- Advertisement -

ప్ర‌భుత్వ పెద్ద‌ల మెప్పు పొందేందుకు పోలీసులు ప‌ని చేస్తున్నారని.. తమ ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌ప్ప‌కుండా పోలీసుల‌కు వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) క‌క్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారని ధ్వజమెత్తారు. దాడుల‌కు పాల్ప‌డే ఇంత పిరికి ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ చూడ‌లేదన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాగా హుజురాబాద్‌లో దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ తోపులాటలో కౌశిక్ రెడ్డి స్పృహ తప్పి కోల్పోయారు. వెంటనే హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన మీద హత్యాయత్నం చేయిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News