KTR| అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదని తెలిపారు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిదర్శనమన్నారు. తొక్కిసలాట ఘటన బాధితులకు తాను మద్దతుగా ఉంటానని.. ఈ ఘటనతో బన్నీ నేరుగా బాధ్యుడు కాదని పేర్కొన్నారు. జాతీయ అవార్డ్ విజేతను ఓ సాధారణ నేరస్తుడిగా పరిగణించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
పాలకుల అభద్రతకు అల్లు అర్జున్ అరెస్ట్ పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఇదే లాజిక్‌తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని..హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు.