Thursday, December 12, 2024
HomeతెలంగాణKTR: రేవంత్ మీది ప్రభుత్వమా..? అబద్దాల ఫ్యాక్టరీనా..?: కేటీఆర్

KTR: రేవంత్ మీది ప్రభుత్వమా..? అబద్దాల ఫ్యాక్టరీనా..?: కేటీఆర్

KTR| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాటలు అబద్ధం..చేతలు అబద్ధమని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆర్బీఐ(RBI)లెక్కలతో సహా పోస్ట్ చేశారు.

- Advertisement -

“రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? అర్ధసత్యాలు.. అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు. కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? రూ.50వేల కోట్లు, రూ.65వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం..? ఆర్భీఐ హ్యాండ్ బుక్(RBI Handbook of India States)లెక్కలు మేరకు తెలంగాణ అప్పు ఎంత ఉందో తేటతెల్లమవుతోంది. ఢిల్లీకి మూటలు మోసేందుకా..? నీ జేబు నింపుకునేందుకా..? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు” అని కేటీఆర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News