Tuesday, September 17, 2024
HomeతెలంగాణKTR: బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర

KTR: బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర

బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకంను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ డా.కె. వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ కు విచ్చేసిన అంధులతో ఆ పుస్తకాన్ని చదివించుకుని ఆ పుస్తకంలోని విశేషాలను వాసుదేవరెడ్డిని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.
కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్థి రాజకీయ జీవితం, రాజకీయాల్లో అనుభవించిన పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ముఖ్యమంత్రి గా కేసీఆర్ పాలన, తెలంగాణలో అమలవుతున్న పథకాలను పుస్తకంలో పొందుపరిచినట్టు వాసుదేవరెడ్డి మంత్రి కేటీఆర్ కి వివరించారు.
ఈ ఆలోచన అత్యద్భుతమని కేటీఆర్ ప్రశంసించారు. ఇక ఈ బ్రెయిలీ పుస్తకాన్ని అంధులు చదివి వినిపిస్తుండగా ఒక్కసారిగా అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News