Sunday, July 7, 2024
HomeతెలంగాణKTR @ Lawyers meeting: బీఆర్ఎస్ కు మద్దతుగా లాయర్లు

KTR @ Lawyers meeting: బీఆర్ఎస్ కు మద్దతుగా లాయర్లు

రాష్ట్రాన్ని వేరే చేతుల్లో పెట్టే రిస్క్ వద్దు

బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా జలవిహార్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బార్ కౌన్సిల్ మెంబర్ గండ్ర మోహన్ రావు, బిసి కమిషన్ మెంబర్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ మెంబర్ కొంతం గొవర్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. భారీ సంఖ్యలో హాజరైన న్యాయవాదులను ఉద్దేశించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పోటీగా న్యాయవాదులు ఉద్యమం చేశారు, సీఎం కేసీఆర్ పార్లమెంట్ ముట్టడి కి పిలుపునిస్తే అప్పుడు కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో వందల, వేల కేసుల్లో మాకు అండగా నిలిచారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మాతో నిలబడ్డారు అందరికి ధన్యవాదాలు. అప్పుడేట్లుండే తెలంగాణ ఇప్పుడేట్లుండే తెలంగాణ అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 2014 లో కరెంట్,
సాగునీరు, తాగునీరు, వైద్యం, విద్యావవస్థలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి..

అక్టోబర్ 25 న కర్ణాటక డిప్యూటీ సీఎం dk శివకుమార్ ఫ్యాక్స్ కాన్ కి లేఖ రాశారు హైదరాబాద్ లో పెట్టాలిసిన ఫ్యాక్టరీ బెంగుళూరుకు తరలించాలని లేఖ రాశారు.. తొందరలో తెలంగాణ లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది హైదరాబాద్ లో ఉన్న పలు కంపెనీలు బెంగుళూరుకు వస్తున్నాయ్ అని లేఖ రాసారు, సీఎం కేసీఆర్ ని వదులుకుంటే ఎం జరుగుతుందో ఇదొక చిన్న ఉదాహరణ. కాంగ్రెస్ చేతుల్లోకి తెలంగాణ వెళితే ఢిల్లీ, బెంగుళూరు నుండి పాలన కొనసాగుతుంది. నాలుగేళ్లు వెంబడి పడి ఫ్యాక్స్ కాన్ సంస్థ మనవద్దకు తెచ్చుకున్నము. ఫ్యాక కాన్ కి కొంగరకాలన్ లో 200 ఎకరాలు ఇచ్చాము నిర్మాణం జరుగుతుంది మేలో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది..

తెలంగాణ మాడల్ దేశంలో ఎక్కడా లేదు…

మూడున్నర కోట్ల వరిదాన్యం పండిస్తున్నము దేశానికి అన్నం అందిస్తూ అన్నపూర్ణగా మారింది తెలంగాణ ..హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీనరి పెరిగింది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. దేశంలో అన్ని రంగాల్లో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. దళితబంధు లాంటి పథకం పెట్టాలంటే నాయకునికి దమ్ము ధైర్యం కావాలి… సీఎం కేసీఆర్ దమ్మున్న దక్షిత కలిగిన నాయకుడు కాబట్టి ఇలాంటి అద్భుతమైన పథకాలు వస్తాయి.. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నము. రైతు బంధు, రైతు బీమా ,రైతు వేదికలు కట్టిన ఇవన్నీ కేసీఆర్ తోనే సాధ్యమవుతాయి… రైతుల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్, సన్నీ డియోల్ హైదరాబాద్ చూసి ఇక్కడే ఉండిపోవాలని ఉందని చెప్పాడు.

రజనీకాంత్ వచ్చి హైదరాబాదా న్యూ యార్క అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తెలంగాణ వస్తే హైదరాబాద్ అగమైద్దని తెలంగాణ ఏర్పాటుకు మందు మనం విన్న మాటలు….కానీ ఇప్పుడు చుస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది…2014 లో 2018 లో ఎవర్ని నమ్ముకోలేదు ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నము… ఇప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకున్నము.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి రాహుల్ గాంధీ, మోడీ కాదు ప్రజలు ఆలోచించాలి… ఇంత కష్టపడి అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలోనో పెడదమా ఆలోచించండి..తొమ్మిదిన్నరేళ్లు ప్రభుత్వం నడిపినప్పుడు కొన్ని తప్పులు ఉంటాయి తెలంగాణ బిడ్డలుగా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించార లేదా అని ఆలోచించాలి.. చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరం కలిసి పరిష్కరించుకుందాం…

కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం మన పిల్లలు సురక్షితంగా ఉంటారు అందరూ ఆలోచించాలి..దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా అని రాహుల్ గాంధీ అంటుండు రాహుల్ గాంధీకి చెబుతున్న ఢిల్లీ దొరలకు నాలుగు కోట్ల ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. 1969 ఉద్యమంలో లో 370 మంది ని పిట్టల్ని కాల్చినట్టు చంపించింది రాహుల్ గాంధీ నాయనమ్మ. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకుల చావుకు కారణం అయ్యారు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు.. సోనియాగాంధీ బలిదేవత అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు.. సావనైనా సస్తాం కానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచము….వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ బిజెపి బిసి సీఎం అని అంటున్నారు.

ఒడిపోతానని తెలిసి కాలేరు వెంకటేష్ మీద నిలబడటానికి కిషన్ రెడ్డి భయపడ్డడు..కాంగ్రెస్ లో 11 మంది సీఎం లు ఉన్నారు వాళ్లకు పదవులు కావాలి తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదు…కర్ణాటక లో కాంగ్రెస్ నాయకులు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. పైసలు పంచుకుంటూ దొరికిన రేవంత్ రెడ్డి సీఎం ని గన్ పార్క్ వద్దకు రమ్మని చెప్పడం ఎంత సిగ్గుచేటు.. అమరులను చేసిందే కాంగ్రెస్ పార్టీ. సొంత నిర్ణయం టిసుకునే ఒక్క నాయకుడు కూడా బిజెపి,కాంగ్రెస్ పార్టీలో లేరు. ప్రభుత్వం రాగానే అడ్వకెట్ల డిమాండ్స్ తప్పకుండా నెరవేరుస్తాము…ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము ఇమాము లకు,అర్చకులకు గౌరవ వేతనం ఇస్తున్నము. మన కడుపులు కొట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా కడుపులు నింపే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలి…

రిస్క్ తీసుకోవద్దు తెలంగాణను ఇంకొని చేతులో పెట్టొద్దు..వినోద్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

మలిదశ ఉద్యమం సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో జరిగినప్పుడు న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించారు..ఆర్టికల్ 3 లో ఉన్న ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ఆవశ్యకతను గుర్తించారు..ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వస్తుందని సీఎం కేసీఆర్ ముందే ఊహించారు…వచ్చే ఎన్నికల్లో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News