ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాయాలనికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్యాలయం లోపలికి తన లాయర్లను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు లాయర్లు వస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు. లాయర్లను లోపలికి అనుమతించాలని కోరారు.
అయితే ఏసీబీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన లాయర్లతో కలిసి ఆయన వెనుదిరిగారు. కార్యాలయం బయట అరగంట సేపు వేచి చూసి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నోటీసు ఇచ్చిన అధికారికి రాతపూర్వకంగా కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఆయన వివరణ ఇచ్చారు. లాయర్ సమక్షంలో విచారణ చేయమని కోరగా.. లాయర్‌ను ఏసీబీ లోపలికి అనుమతించలేదు. కేసుకు సంబందించిన తన స్టేట్మెంట్‌ను లెటర్ ద్వారా కేటీఆర్ అందించగా.. అక్నాలెడ్జ్ చేసినట్లు ఏసీబీ రిప్లై ఇచ్చింది.