Sunday, December 8, 2024
HomeతెలంగాణKTR: ఎంపీ వద్దిరాజు నాయకత్వాన చేరికలు

KTR: ఎంపీ వద్దిరాజు నాయకత్వాన చేరికలు

బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

అశ్వారావుపేట, సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరారు. అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి జెడ్పీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సున్నం నాగమణి, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రముఖులు కొండూరి సుధాకర్, ఇల్లందు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు బండి సత్యనారాయణ తదితరులు ఎంపీ రవిచంద్ర నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టీ.రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు, బీఆర్ఎస్ నాయకులు ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News