Saturday, May 17, 2025
HomeతెలంగాణKTR: మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్.. అసలు ఏం జరుగుతోంది..?

KTR: మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్.. అసలు ఏం జరుగుతోంది..?

బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోందననే ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. ఆ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇటీవల పార్టీలోని కొందరు నేతలు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు కేటీఆర్‌ నాయకత్వంలోనూ పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అయినా కానీ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఓ అడుగు ముందుకేసి హరీశ్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శుక్రవారం మధ్యాహ్నం హరీశ్ రావు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంట పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి హరీశ్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వం వైఫల్యాలు తదితర అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గులాబీ పార్టీ వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News