Sunday, July 7, 2024
HomeతెలంగాణKTR: నాడు కరువుతో విల విల, నేడు పచ్చని పొలాలతో కళ కళ

KTR: నాడు కరువుతో విల విల, నేడు పచ్చని పొలాలతో కళ కళ

పాలమూరు జిల్లాలో వ్యవసాయ భూముల ధరలు ఏ ప్రాంతానికి వెళ్లినా 15 లక్షలకు తక్కువ లేదు, ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత

ఒకనాడు కరువుతో విలవిలలాడిన పాలమూరు జిల్లా నేడు ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో విరగ పండిన ధాన్యపు రాశులతో కళకళలాడుతోందని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిమిత్తం ఆయన మహబూబ్నగర్ కు విచ్చేశారు. స్థానిక ప్రభుత్వ మహిళ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో సెయింట్ పౌండేషన్, శాంత నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్ డెవలఫ్ మెంట్ సెంటర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి లో అగ్రభాగాన ఉందని, ఐటీ రంగాల్లో 30 శాతం అభివృద్ధి తెలంగాణ లో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా 16 దేశాలలో తమ ఫార్మ కంపెనీలు నెలకొల్పిన సేయింట్ డైరెక్టర్ జీ వి మోహన్ రెడ్డి నేడు మహబూబ్నగర్లోని మహిళా ఐటిఐ కళాశాలకు చెందిన 120 మందికి విద్యార్థినిలకు ఉద్యోగాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. వారు ఈ ప్రాంతంలో ఫార్మ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుంది అన్నారు.

- Advertisement -


మనిషి జీవితంలో పదవులు, డబ్బులు ఆశాశ్వతం… మంచి పనులే శాశ్వతం…చేసిన మంచి పనులే మనిషిని చరిత్ర లో నిలబెడతాయని పేర్కొన్నారు. ప్రతి మనిషి ఎప్పటికి అప్పుడు తన మేధస్సు ను అభివృద్ధి చేసుకోవాలని,లేదంటే వెనకబడి పోతామని అన్నారు.విద్య మనిషిని ఒక స్థాయికి తీసుకెలుతుందని, విద్యతో పాటు అనర్గలంగా మాట్లాడే నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎదగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఉంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ గురుకుల విద్యార్థులను తయారు చేస్తున్నాము. ఐ ఐ టీ, నీట్ వంటి ఉన్నత పరీక్షలలో గురుకుల విద్యార్థులు విజయం సాధిస్తున్నారు. అది తనకెంతో గర్వకారణం అన్నారు. పాలమూరు జిల్లాకు రు.9500 కోట్ల పెట్టుబడి తో అమర్ రాజా కంపెనీ వచ్చిందని, దీని వలన ఇక్కడి విద్యార్థుల కు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయి అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఇదంతా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్నారు. విద్యార్థులు కష్టపడి విజయం సాదించాలని, ఈ రోజు ఎన్నో అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయన్నారు. 2014కి పూర్వం రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేడు 24 గంటలు కరెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందని, ఇంటింటికి తాగు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తెలంగాణ రాక ముందు కేవలం 5 మెడికల్ కళాశాలలు ఉండేవి.. కానీ నేడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉంది… ప్రజారోగ్యంలో తెలంగాణ గణమైన అభివృద్ధి సాధించింది అన్నారు. పాలమూరు జిల్లాలో నేడు వ్యవసాయ భూముల ధరలు ఏ ప్రాంతానికి వెళ్లినా 15 లక్షలకు తక్కువ లేదని ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు.పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం పూర్తిగా మారుతుందని ఎటు చూసిన పచ్చని పంట పొలాలు ఉంటాయన్నారు. అనంతరం గత మూడు నెలలుగా సెయింట్ పౌండేషన్, శాంత నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 120 మంది విద్యార్థినిలకు ఉద్యోగనియామక పత్రాలు, సర్టిపికెట్స్ అందించారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…

బి వి మోహన్ రెడ్డి పాలమూరు లో ఐటీ కంపెనీ పెట్టాలని,మహిళా ఐ టీ ఐ కళాశాల ని అభివృద్ధి చేయాలని తెలిపారు. మోహన్ రెడ్డి ప్రపంచం లో ఎక్కడ ఉన్న
పుట్టిన ఊరు ఋణం తీర్చు కోవాలని అన్నారు.మహిళా ఐ టీ ఐ కళాశాలను మాడ్రాన్ ఐ టీ ఐ గా మార్చాలని అన్నారు.విద్యార్థులు బద్ధకం వదిలి విజయం సాదించాలని సూచించారు.నేటి యువతకు టెక్నాలజి అందుబాటులో ఉందని,నేడు టెక్నాలజీ ఉన్న వాళ్లే ధనవంతులన్నారు. మల్లారెడ్డి తనదైన శైలి లో మాట్లాడగానే విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కరతళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర పర్యాటక, పురావాస్తు, క్రీడలు, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….

2014 కు ముందు పాలమూరు జిల్లా రెండు జీవనదులు పక్కనే ఉన్న కూడా తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు. కెసిఆర్ సారాధ్యంలో పాలమూరు జిల్లా నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతోందని తెలిపారు. సెయింట్ డైరెక్టర్ మోహన్ రెడ్డి మహిళా ఐటిఐ కళాశాల అభివృద్ధికి సహకారం అందించడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఆనందంగా ఉందని తెలిపారు.పేదలకు అండగా ఉండటం చాలా గొప్ప విషయం అన్నారు.సెయింట్ పౌండేషన్ వాళ్లకు ఐటీ పార్క్ లో స్థలం ఇస్తామని వాళ్ళు ఇక్కడ ఐటీ సంస్థ నెలకొలపాలని కోరారు. తమ కుటుంబం మొత్తం మోహన్ రెడ్డి అభివృద్ధి లో పాలు పంచుకుంటామని తెలిపారు. కొందరు కుట్రలు, కుతంత్రాలతో అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని అలాంటి వాళ్ళను పంట కాలువలో వేసి తొక్కుతాం అన్నారు.నేడు 120 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఆనందం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, జిల్లా కలెక్టర్ రవి నాయక్, నరసింహ, ముడా చైర్మన్ గంజి వెంకన్న, పురపాలక సంస్థ చైర్మన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News