Thursday, July 4, 2024
HomeతెలంగాణKTR on Bayyaram: ఈయన అజ్ఞాని, ఆయన అదానీ, డెడ్లీ కాంబినేషన్

KTR on Bayyaram: ఈయన అజ్ఞాని, ఆయన అదానీ, డెడ్లీ కాంబినేషన్

విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు లేదన్న బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి మాటలపై కేటీఆర్ వివరణ ఇచ్చారు.  బైలదిల్లా నుంచి బయ్యారానికి ఐరన్‌ ఓర్‌ ఇస్తే అదానీకి నష్టమన్న కారణంతో కేంద్రం జాప్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ ను వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సప్లై చేస్తే ముంద్రాలో అదానీ పాష్కో పెట్టాలని సంకల్పించిన ఫ్లాంట్‌కు నష్టం వస్తుందని, అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలను చావుదెబ్బ కొట్టారంటూ కేంద్ర వైఖరిపై కేటీఆర్ వివరణ ఇచ్చారు.  రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేత అజ్ఞాని, ఆయన ఆదానీ.. డెడ్లీ కాంబినేషన్‌ అంటూ కేటీఆర్ సెటైర్లు వేసి చురకలు అంటించారు. ప్రధాని, అదానీ కలిసి తెలంగాణ పొట్ట కొడుతున్నారని, ఇదంతా వాస్తవం కాకపోతే తనపై పరువు నష్టం దావా వేయవచ్చని కేటీఆర్ సవాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News