Mahabubabad Mahadharna | నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గిరిజన మహాధర్నాకి పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకేరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనకి చిట్యాల వద్ద ఘనస్వాగతం పలికారు.
కాగా, లగచర్ల ఘటనలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహబూబాబాద్ మహాధర్నా (Mahabubabad Mahadharna) చేపడుతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నెల 21నే బీఆర్ఎస్ మహాధర్నా చేయాలని ముందు నిర్ణయించింది. కానీ అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వాలంటూ మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చేశాయి. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నవంబర్ 21న మహబూబాబాద్ లో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ కూడా విధించారు. దీంతో బీఆర్ఎస్ నేటికి మహాధర్నా ముహుర్తాన్ని మార్చింది.