Thursday, March 20, 2025
Homeతెలంగాణపాదయాత్రకు సిద్ధమైన కేటీఆర్.. లక్ష్యం అదేనంట..!

పాదయాత్రకు సిద్ధమైన కేటీఆర్.. లక్ష్యం అదేనంట..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధమయ్యారు. గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన.. BRS కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పాదయాత్ర పై కసరత్తు జరుగుతోందని తెలియజేశారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. సూర్యాపేటలో పబ్లిక్‌ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రాధాన్యతని చాటారని, కేసీఆర్ తెలంగాణ ప్రాధాన్యతని దేశానికి తెలియజేసారని చెప్పారు. తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్ అని తెలిపారు. కేసీఆర్ స్థాయికి చేరని కొందరు అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని చెప్పారు. తొలి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు సుపరిపాలన అందించిన పార్టీగా ఉన్నామని గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఇక చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన పర్సనాలిటీ పెంచుకుంటారని భావిస్తే, పర్సెంటేజీలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News