Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR Fire on BJP: "ఉగ్రవాద దేశంతో మ్యాచ్‌ ఏంటి.. ఇదేనా మీ జాతీయవాదం?"

KTR Fire on BJP: “ఉగ్రవాద దేశంతో మ్యాచ్‌ ఏంటి.. ఇదేనా మీ జాతీయవాదం?”

BRS Working President Criticizes BJP: బీజేపీ అనుసరిస్తున్న జాతీయవాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటంపై బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఉగ్రదాడిపై మౌనం ఎందుకు?: జాతీయవాదాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకుంటున్న బీజేపీ.. ఐదు నెలల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని మరిచిందని కేటీఆర్ అన్నారు. ఆ దుర్ఘటన బాధితులు ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు బీజేపీ ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుందని ఆయన నిలదీశారు. ఈ అంశంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/relief-for-telangana-farmers-as-center-pledges-timely-urea-supply/

సుప్రీంకోర్టు ఆదేశాలపై అగౌరవం: వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడంపై బీజేపీ మద్దతుదారులు కలవరపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది భారత రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై బీజేపీకి గౌరవం లేదని స్పష్టం చేస్తుందని ఆయన విమర్శించారు.

జాతీయవాదం vs జింగోయిజం: కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా చూడటమే.. తమ పార్టీకి తెలిసిన నిజమైన జాతీయవాదమని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశాన్ని నిర్మించేది జాతీయత అయితే అహంకారం, ఆధిపత్యాన్ని ప్రదర్శించేది జింగోయిజం అని అన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బీజేపీ గ్రహించాలని ఆయన హితవు పలికారు. తన పోస్టును “జైహింద్” అంటూ కేటీఆర్ ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad