పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై కేటీఆర్ అభ్యంతరం. ఇది పోలీస్ శాఖకు, డిజిపికి అంగీకారయోగ్యమైన బాషనా అని ప్రశ్న. పోలీసులకు ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్. ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్న కేటీఆర్. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న స్పందించని పోలీసులు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డిజిపికి సూచన.
KTR questions DGP again: పోలీసుల వ్యవహార శైలిపై డిజిపిని మరోసారి ప్రశ్నించిన కేటీఆర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES