Saturday, April 26, 2025
HomeతెలంగాణKTR: తెలంగాణ రానున్న రాహుల్ గాంధీకి కేటీఆర్ విజ్ఞప్తి

KTR: తెలంగాణ రానున్న రాహుల్ గాంధీకి కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాహుల్ గాంధీకి ఓ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ఎక్స్ వేదికగా కోరారు.

- Advertisement -

లగచర్ల గ్రామం, సుంకిశాల, హైడ్రా కూల్చివేత ప్రదేశాలు, మూసీ కూల్చివేతల ప్రాంతం, హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి, కలుషితాహారం కారణంగా మరణించిన గురుకుల విద్యార్థుల కుటుంబాలు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలవాలని సూచించారు. అలాగే కూలిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, ఫోర్త్ సిటీ, మొదటి ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన అశోక్ నగర్‌ను సందర్శించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News