తన అరెస్ట్ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. తనను అరెస్ట్ చేసి ఆనందం పొందాలనుకుంటే మీ కర్మ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) చురకలు అంటించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది. 30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ కర్. గుడ్ లక్ చిట్టినాయుడు అండ్ కో. న్యాయపరంగానే మిమ్మల్ని ఎదుర్కొంటా’ అని తెలిపారు
కాగా ఈ-ఫార్ములా రేసుకు సంబంధించి జరిగిన అవకతవకలపై కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సీఎస్ ద్వారా గవర్నర్ ఆమెదం నోటీసులను ఏసీబీకి పంపిస్తామని.. అనంతరం కేటీఆర్‌పై కేసు నమోదుచేసి విచారణ జరుగుతందన్నారు. దీంతో త్వరలోనే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి.