తనపై నమోదైన ఏసీబీ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా అసెంబ్లీలోనే ఫార్ములా-ఈ కార్ రేసింగ్(Formula-E car racing) వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని వెల్లడించారు. ఏదో కుంభకోణం జరిగిందంటున్నారని.. చర్చ పెడితే అసెంబ్లీలోనే సమధానం చెబుతానని తెలిపారు.
కాగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.